
అత్యాచారానికి పాల్పడిన వారిని పలు దేశాలు కఠినంగా శిక్షిస్తున్నాయి. కొన్ని దేశాల్లో విచారణను తొందరగా ముగించి.. కేసు తీవ్రతను బట్టి శిక్ష విధిస్తారు. అత్యాచారాలకు పాల్పడేవారికి ఏ దేశంలో ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసుకోండి.
ఉత్తర కొరియా:
రేపిస్టులకు ఈ దేశంలో మరణ శిక్షలు అమలవుతాయి. నేరస్థులపై ఎలాంటి దయా చూపించరు. నేరానికి పాల్పడిన వ్యక్తి తలపై లేదా సున్నిత అవయవాలపై ఓ స్పెషల్ టీమ్ తుపాకీతో కాల్చి చంపుతుంది.
చైనా:
ఇక్కడ అత్యాచారం ఘోరమైన నేరం. విచారణ, న్యాయ ప్రక్రియ చాలా వేగంగా పూర్తి చేస్తారు. నేరస్థులను వెనక నుంచి తుపాకీతో కాల్చి చంపుతారు.
సౌదీ అరేబియా:
విచారణ పూర్తయిన కొన్ని రోజుల్లోనే శిక్ష పడుతుంది. నేరస్థులకు మత్తు ఇచ్చిన బహిరంగంగా మరణ శిక్ష అమలు చేస్తారు. రాళ్లతోనూ కొట్టి చంపుతారు.
ఇరాన్:
నేరస్థులకు బహిరంగ మరణశిక్ష పడుతుంది. ఉరి తీయడం లేదా తుపాకీతో కాల్చి చంపడం వంటి శిక్షలుంటాయి. బాధితులు అంగీకరిస్తే మాత్రం మరణశిక్షను నిలిపేస్తారు. ఇలాంటి సందర్భాల్లో 100 కొరడా దెబ్బలు, జీవిత ఖైదు విధిస్తారు.
అఫ్గానిస్థాన్:
నేరానికి పాల్పడిన 4 రోజుల్లోనే శిక్ష పడుతుంది. తలలో కాల్చి చంపడం లేదా ఉరి తీయడం చేస్తారు. బాధితులే శిక్షను అమలు చేసేందుకు కూడా వీలుంటుంది.
పాకిస్థాన్:
సామూహిక అత్యాచారం, బాలలపై లైంగిక దాడులు, అత్యాచారం ఈ మూడింటికీ మరణ శిక్ష పడుతుంది. ఓ మహిళ శరీర భాగాలు బహిరంగంగా కనిపించేలా ఆమెపై దాడికి పాల్పడినా ఇదే శిక్ష పడుతుంది.
అమెరికా:
రెండు రకాల చట్టాలుంటాయి. రాష్ట్ర చట్టం, సమాఖ్య చట్టం, సమాఖ్య చట్టం పరిధిలో అత్యాచార నేరస్థులకు గరిష్టంగా జీవిత ఖైదు (30 ఏళ్ల జైలు) పడుతుంది. అత్యాచారం సహా వివిధ రకాల లైంగిక దాడులకు పాల్పడిన వారికి మూడు డిగ్రీల్లో శిక్షలుంటాయి. లూసియానా, ఫ్లొరిడా వంటి రాష్ట్రాల్లో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.