మనం రోజూ వంటల్లో వాడే కొత్తిమీరను ఆయుర్వేద, గిరిజన వైద్యంలో మందుగానూ వాడుతుంటారు. ముఖ్యంగా మూర్ఛ రోగాన్ని నివారించడానికి దీన్ని వాడుతారని తెలిసింది. అయితే అది ఆ వ్యాధిని ఎలా నివారిస్తుందన్నది ఇంతవరకూ తెలియలేదు.
అందుకోసం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన పరిశోధకులు చేసిన పరిశీలనలో కొత్తిమీరలోని డోడెసెనాల్ అనే కీలక పదార్థం పొటాషియంతో బంధం ఏర్పరచుకుని అది రక్తంలో సులభంగా కలిసేలా చేయడం ద్వారా మెదడు, గుండె పని తీరుని క్రమబదద్ధీకరిస్తుంది. ఫలితంగా మూర్ఛ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఆ కారణంతోనే దీన్ని గిరిజన వైద్యంలో ఎప్పటినుంచో వాడుతున్నట్లు చెబుతున్నారు.
అంతేకాదు, కొత్తిమీరలో క్యాన్సర్, ఇన్‌ఫ్లమేషన్, ఫంగల్, బ్యాక్టీరియల్ సమస్యల్ని నిరోధించడంతో పాటు గుండె, పొట్ట ఆరోగ్యానికి తోడ్పడే గుణాలు అనేకం ఉన్నట్లు గుర్తించారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com