రంగారెడ్డి జిల్లా జన్వాడ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ జీవోను కాదని మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
111జీవోను తుంగలో తొక్కి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా 25 ఎకరాల భూమిలో కేటీఆర్ ఫామ్‌హౌస్ నిర్మాణం చేపట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అతిక్రమించారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్లాక్ మెయిలింగ్‌కు రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని సుమన్ ధ్వజమెత్తారు. గోపన్‌పల్లిలో దళితుల భూముల్ని రేవంత్ బ్రదర్స్ కబ్జా చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఓ కబ్జా కోరు.. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రి కేటీఆర్‌పై బురద జల్లుతున్నాడని విమర్శించారు.
రేవంత్ చెబుతున్న భూములు 2014 అఫిడవిట్‌లో కేటీఆర్ చెప్పారని, ఫామ్‌హౌస్‌ను నాలుగేళ్ల క్రితం కేటీఆర్ లీజుకు తీసుకున్నారని సుమన్ తెలిపారు. 8 ఎకరాల 9 గుంటలు కేటీఆర్ భార్య పేరుపై ఉందని సుమన్ స్పష్టం చేశారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com