హైదరాబాద్‌లో హాస్టల్ విద్యార్ధులు, ఉద్యోగులను ఉన్న పళంగా ఖాళీ చేయించడంపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఉద్యోగులు, విద్యార్ధులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. హాస్టళ్లు ఖాళీ చేయించడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు లేక కొందరు, NOC కోసం పోలీస్ స్టేషన్‌ల ముందు క్యూ కట్టారు. ప్రభుత్వం తమ ఇబ్బందులపై స్పందించాలని విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హాస్టల్, పేయింగ్ గెస్ట్‌హౌస్ నిర్వహకులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఏ ఒక్కరినీ కూడా హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించవద్దని, అనవసరంగా భయాందోళనను సృష్టించవద్దని నిర్వాహకులను కోరారు.
Request all Hostel/PG managements in Hyderabad city to NOT evict anyone & cause undesirable panic
I have already asked @CommissionrGHMC @bonthurammohan and @CPHydCity @cpcybd to ensure that you receive all support to run the facilities without problems
— KTR (@KTRTRS) March 25, 2020
ఇప్పటికే ఇదే విషయంపై GHMC కమిషనర్, మేయర్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో చర్చించానని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.
I request all of our Hyderabad city public representatives including MLAs, @bonthurammohan Deputy Mayor @Babafasiuddin and all the Corporators along with officials to visit the hostels in their respective areas to convey the same to students & hostel managements
— KTR (@KTRTRS) March 25, 2020
హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధులు, మేయర్, డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్లు తమ ప్రాంతంలో ఉన్న హాస్టళ్లకు సంబంధిత అధికారులతో వెళ్లి ఈ సమాచారాన్ని విద్యార్థులకు, నిర్వాహకులకు చేరవేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
@TelanganaDGP @NASSCOM_Hyd @CYBTRAFFIC @SCSC_Cyberabad @HYSEA1991 @KTRTRS @TelanganaCMO @hydcitypolice @RachakondaCop pic.twitter.com/dBjNPQGBH6
— Cyberabad Police (@cyberabadpolice) March 25, 2020
Minister @KTRTRS visited the call centre set up at the @GHMCOnline head office which is in place to respond to the queries related to #coronavirus. Minister interacted with the staff and asked them to respond with empathy to the queries of citizens. #COVID19 #coronavirus pic.twitter.com/uxAYpaXSTo
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 25, 2020
MA&UD Minister @KTRTRS visited the GHMC night shelter at Golnaka and interacted with the senior citizens and children. Minister enquired about the facilities at the night shelter and instructed the officials to provide Aasara Pension to the eligible residents. pic.twitter.com/QMZuABnrJY
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 25, 2020