విటమిన్ బి6 విశేషాలు

0

మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ బి6 కూడా ఒకటి. దీన్నే పైరిడాక్సిన్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్. మన శరీరంలో అనేక పనులకు ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్ల మెటబాలిజంకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి6 ఎంతో అవసరం ఉంటుంది. అయితే ఈ విటమిన్‌ను మన శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు. కనుక ఆహార పదార్థాల ద్వారానే మనం దీన్ని పొందాల్సి ఉంటుంది.

ఇక విటమిన్ బి6 మనకు తగినంతగా లభించకపోతే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు వస్తాయి. పెదవులు పగులుతాయి. నాలుక, నోటి పూత వస్తుంది. డిప్రెషన్‌తో ఉంటారు. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. నిస్సత్తువగా, అలసిపోయినట్లుగా ఫీలవుతారు. చేతులు, పాదాల్లో గుండు పిన్నులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి ఫిట్స్ కూడా వస్తాయి. అయితే విటమిన్ బి6 ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే పైన చెప్పిన అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

విటమిన్ బి6 మనకు ఎక్కువగా చేపలు, పిస్తాపప్పు, అరటిపండ్లు, అవకాడోలు, చికెన్, మటన్ లివర్, పాలకూర తదితర ఆహారాల్లో లభిస్తుంది. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ బి6 లోపం రాకుండా చూసుకోవచ్చు. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్, కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

Next articleఈ పండు తింటే ఇన్ని లాభాలున్నాయా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here