కొవ్వొత్తిలా
తను కరిగిపోతూ
మన జీవితానికి
వెలుగునిచ్చేవాడే
నాన్న..
నాన్నంటే భరోసా
నాన్నంటే భద్రత
నాన్నంటే బాధ్యత
నడిచొచ్చే దైవం..
నాన్నంటే
బంధం మాత్రమే కాదు
నాన్నంటే బలం
భయం మాత్రమే కాదు
నాన్నంటే బాధ్యత
నాన్నంటే సంతోషం మాత్రమే కాదు
నాన్నంటే సర్వస్వం
మనకు నడక నేర్పించి.. జీవితంలో ఎలా నడుచుకోవాలో చెబుతాడు నాన్న. అల్లరి చేస్తే వారిస్తాడు.. వినకుంటే హెచ్చరిస్తాడు. దారితప్పితే దండిస్తాడు.. ఎందుకంటే అందరిలో మనం నవ్వులపాలు కాకుడదని. మనకు ప్రపంచాన్ని పరిచయం చేయడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించాలని కాంక్షిస్తాడు నాన్న.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఒక్కో రోజున ‘ఫాదర్స్ డే’ జరుపుకుంటాయి. కానీ ఎక్కువ దేశాల్లో ప్రజలు జూన్ మూడో ఆదివారం రోజునే జరుపుకుంటారు. మన దేశంలో కూడా ఈ రోజునే ‘ఫాదర్స్ డే’ జరుపుకుంటున్నాం.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com