చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయంతో చైనాకు చుక్కలు కనబడుతున్నాయి. డ్రాగన్ కంట్రీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్న చందంగా తయారైంది. ఇప్పటికే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంటే గట్టి దెబ్బే తగిలిందని అర్ధమవుతోంది.
యాప్‌ల నిషేధం వల్ల టిక్‌టాక్, హలో యాప్‌ల మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఏకంగా 45వేల కోట్లు నష్టపోనుందని చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ అంచనా వేసింది. ఒక్క మేలోనే ప్రపంచ వ్యాప్తంగా 112 మిలియన్ల సార్లు టిక్‌టాక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారన్న మొబైల్ యాప్ విశ్లేషణ సంస్థ సెన్సార్ ట్వోర్ నివేదికను ప్రస్తావించింది. వీరిలో ఎక్కువమంది భారతీయులే ఉన్నారని వెల్లడించింది. నిషేధించిన 59 యాప్‌లు మొత్తంగా 70 నుంచి 80వేల కోట్ల వరకు నష్టపోయే అవకాశముందని సమాచారం.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com