తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు రోజూ నమోదవుతున్నాయి. దీంతో సిటీలో ఉండాలంటే జనాలు వణికిపోతున్నారు. ఓవైపు టెస్ట్‌లు తక్కువ చేస్తున్నారని.. మరోవైపు ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ చేయడం లేదని ప్రతిపక్షాలతో సహా ప్రజలు కూడా అసంత్రుప్తి వ్యక్తం చేశారు. దీంతో కరోనా కట్టడికి ముందుగా ప్రభుత్వం లాక్డౌన్ వైపు మొగ్గు చూపినా.. చివరికి టెస్ట్ అండ్ ట్రేసింగ్ విధానాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. మొన్నటి వరకు రోజుకూ 3 వేలకు వరకు ఉన్న టెస్ట్‌ల సంఖ్య.. ఇప్పుడు 6 వేలు దాటుతోంది.
ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రగతి భవన్లో ఇప్పటికే 30 మంది వరకు కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయని.. అప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లారని టీవీల్లో, పత్రికల్లో వచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. చాలా మంది ప్రజలు సీఎం ఆరోగ్యం ఎలా ఉందోనని ఆందోళన చెందుతున్నారని వివరించారు. మరి ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.comw