కేసీఆర్ నిర్ణయంతో విపక్షాలకు నష్టం..టీఆర్ఎస్ కు లాభం ఎంత..!

0
అందరి అంచనాలను తలకిందులుచేస్తూ..సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకొని తన రాజకీయ చతురతను మరోసారి ప్రదర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ఊహించని విధంగా వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన సీఎం కేసీఆర్‌..పీవీ కూతురుకు టికెట్ ఇచ్చి విపక్షాలను విస్మయానికి గురిచేశారు. మొన్నటిదాకా మండలి పోరులో హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ స్థానంపై మౌనంగా ఉన్న గులాబీ అధిష్టానం వాణీదేవిని రంగంలోకి దింపింది. ఒకదశలో ఈ స్థానం నుంచి పోటీయే వద్దని అధికార పార్టీ భావించింది. కానీ వ్యూహాత్మకంగా వాణీదేవిని బరిలోకి దింపి విపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చింది.
ఇక పీవీ కూతురుకు టికెట్​ ప్రకటించడంతో ప్రతిపక్ష కాంగ్రెస్​తో పాటు బీజేపీకి కూడా క్లిష్ట పరిస్థితులే ఎదురుకానున్నాయి. ఎందుకంటే వాణీదేవిపై ఎటువంటి విమర్శలు లేవు. ఇప్పటికే వరంగల్​ స్థానం నుంచి పోటీలో ఉన్న పల్లా రాజేశ్వర్​రెడ్డిపై విమర్శలు పదునెక్కాయి. కానీ వాణీదేవిపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేని పరిస్థితి. కాంగ్రెస్​కు ఆధ్యుడు పీవీ కూతురు కావడం, కాంగ్రెస్​ కూడా పీవీ జయంతి ఉత్సవాలు చేస్తున్న విషయం తెలిసిందే. అటు బీజేపీ కూడా అంతే పరిస్థితి. తెలంగాణకు చెందిన పీవీని విమర్శించలేని పరిస్థితి.
పీవీ పేరుతో కాంగ్రెస్​కు చెందిన కొన్ని ఓట్లు కూడా తమ ఖాతాలో పడుతాయనుకుంటున్నారు గులాబీ నేతలు. అయితే ఇక్కడ వాణీదేవి గెలిస్తే టీఆర్​ఎస్​ బోనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ స్థానంపై ఎలాగూ ఆశలు పెట్టుకోవడం లేదు గులాబీదళం. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక ఓడిపోతే మాత్రం దానితో అన్ని వర్గాలపై విమర్శలకు పదునుపెట్టనున్నారు. పీవీకి గౌరవంతో ఆయన కూతురుకు టికెట్​ ఇస్తే కాంగ్రెస్​, బీజేపీ సహాకరించలేదంటూ ఆరోపణలు చేసేందుకు టీఆర్​ఎస్​కు అస్కారం ఉంటోంది. అంతేకాకుండా అనుకున్నట్టుగానే పీవీ కుటుంబానికి గౌరవం ఇచ్చామని, పట్టభద్రులు ఎందుకో ఆదరించలేదనే ప్రచారాన్ని కూడా తీసుకువచ్చేందుకు టీఆర్ఎస్​ ప్లాన్​ వేస్తోన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ స్థానంలో టీఆర్​ఎస్​కు ఎప్పుడు షాక్ లే ఎదురవుతున్నాయి. ఇక్కడి నుండి పోటీచేసి గతంలో దేవీ ప్రసాద్​ ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా పీవీ కూతురును ముందు పెట్టి గేమ్ ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. మరి ఈ సారి అయినా ఆ పార్టీ ఇక్కడ గట్టెక్కుతుందా..లేక చతికలబడుతుందా అన్నది వెయిట్ అండ్ సీ..
Previous articleపెట్రోల్ పై కేంద్రం-రాష్ట్రం పన్నులు ఎంతో తెలుసా..దానికంటే వీళ్ల పన్నులే ఎక్కువ
Next articleభలే దొంగలు..అంబులెన్స్ లోనే నొక్కేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here