AP CM జగన్ (Jagan) ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారా..? ముందస్తు ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవడానికే ఢిల్లీకి వెళ్లారా..? ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సమావేశమై ఇదే అంశం చర్చించారా..? తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలతో పాటే ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించాలని కోరారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఈ ఏడాది నవంబర్- డిసెంబర్‌లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటే ఏపీలోనూ ఎన్నికలు జరిపించాలని ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కోరినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం శ్రీ వైయస్.జగన్.
– సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి భేటీ.
– దాదాపు 1 గంటా, 20 నిమిషాలసేపు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ https://t.co/zZKkaWC1Th— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 5, 2023