Google: గూగుల్‌ డూడుల్‌గా పానీపూరీ.. ఎందుకో తెలుసా..?

0
పానీపూరీ అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు ఇష్టపడతారు. సాయంత్రం పూట అలా బయటకి వెళ్లిన వాళ్లలో చాలా మంది పానీపూరీ తింటుంటారు. ఏ కాలంలోనైనా పానీపూరీకి ఉన్న ఆదరణ మాత్రం తగ్గదు.
పానీపూరిపై ప్రపంచ రికార్డు నెలకొల్పి 8 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. దీంతో పాటు పానీపూరీతో ఓ ఇంటరాక్టివ్‌ గేమ్‌ను తీసుకొచ్చింది. నెటిజన్లను ఈ గేమ్‌ ఆకట్టుకుంటోంది.
2015 జులై 12న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక రెస్టారెంట్‌ 51 రకాల రుచికరమైన పానీపూరీలను అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో ఇప్పుడు గూగుల్‌ 8 ఏళ్ల తర్వాత ఈ రికార్డును గుర్తు చేస్తూ పానీపూరీని డూడుల్‌గా . మన దేశంలో పానీపూరీని వివిధ పేర్లతో పిలుస్తారు.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleమోదీ “ఎన్నికల కేబినెట్‌”పై కసరత్తు పూర్తి.. తెలంగాణ, ఏపీ నుంచి..
Next articleBJP జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కి మరో కీలక పదవి..!