ఈ నెల 21న BRS లిస్ట్.. గులాబీ బాస్ షాక్ ఇవ్వబోతుంది ఎంతమందికో తెలుసా..?

0
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు BRS అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఈ నెల 21 విడుదల చేస్తారా.. ఇప్పటికే గులాబీ బాస్ CM KCR పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్ ఇవ్వట్లేదని చెప్పేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2018లో KCR 105 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈసారి కూడా అలాగే చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇస్తారోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన CM KCR ఈ నెల 21న జాబితా ప్రకటిస్తారని సమాచారం. కేసీఆర్‌ (KCR) కామారెడ్డి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. గజ్వేల్‌ నుంచే బరిలోకి దిగబోతున్నారని తెలిసింది. ఈ జాబితాలో పది మందికి మాత్రమే కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒకటి రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. జనగామలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మహబూబాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ స్థానంలో మంత్రి సత్యవతి రాథోడ్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలిసింది.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి BRSలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో సంగారెడ్డి BRS నేతలు అలర్టయ్యారు. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని.. చింత ప్రభాకర్‌కే టిక్కెట్ ఇవ్వాలని నియోజకవర్గానికి చెందిన కొందరు BRS నేతలు మంత్రి హరీష్ రావు‌ను కోరారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleKhairatabad Ganesh: ఈ ఏడాది ఖైరతాబాద్‌ మహా గణపతి ఫుల్ డిటేల్స్
Next articleఎల్లుండి తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ఆయనకు లక్కీ ఛాన్స్!