పాకిస్థాన్‌‌కు షాక్ ఇచ్చిన న్యూజిలాండ్.. మరి భారత్‌తో తలపడేదెవరు..?

0
వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్త్‌ను న్యూజిలాండ్ దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-3‌లో ఉన్నాయి. నాలుగో స్థానంపై సస్పెన్స్ కొనసాగింది. కానీ శ్రీలంకతో‌ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించడంతో అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ సెమీస్ రేస్ నుంచి ఔట్ అయినట్లే.

న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్‌ను అధిగమించాలంటే తమ చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుతం చేయాల్సి ఉండగా.. అఫ్ఘానిస్థాన్‌కు ఆ ఛాన్స్ కూడా లేదనే చెప్పొచ్చు. ఒకవేళ పాకిస్థాన్‌ తొలుత బ్యాటింగ్ చేసి 300 రన్స్ చేస్తే.. ఇంగ్లండ్‌ను 13 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఒకవేళ ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 50 పరుగులు చేస్తే .. పాకిస్థాన్‌ దాని 2.3 ఓవర్లోనే చేధించాలి.
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాయింట్స్ టేబుల్లో ఇప్పుడున్న తొలి నాలుగు స్థానాలే ఖరారవుతాయి. ఈ నెల 15న ముంబైలో జరిగే తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడుతాయి. 16న కోల్‌కతాలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleసమయం లేదు మిత్రమా.. రేపే లాస్ట్.. కాంగ్రెస్, బీజేపీ నేతల్లో టెన్షన్
Next articleగజ్వేల్‌లో మరోసారి సెంటిమెంట్‌ రిపీట్ అవుతుందా.. గతంలో ఏం జరిగింది..?