గజ్వేల్‌లో మరోసారి సెంటిమెంట్‌ రిపీట్ అవుతుందా.. గతంలో ఏం జరిగింది..?

0
గజ్వేల్ (Gajwel) నియోజకవర్గంలో గెలిస్తే.. అధికారం ఖాయమా.. ? గజ్వేల్‌లో ఇప్పటివరకు ఎన్ని పార్టీలు గెలిచాయి.. ఆ పార్టీలన్నీ అధికారంలోకి వచ్చాయా..? గులాబీ బాస్ కేసీఆర్ (KCR) గజ్వేల్‌లో మూడోసారి గెలిచి సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తారా..?
గజ్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీదే రాష్ట్రంలో అధికారం అన్న సెంటిమెంట్‌ బలంగా ఉంది. 1957 నుంచి ఇక్కడ ఏ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీకే అధికారం దక్కింది.
1957, 1958, 1962, 1967, 1972, 1978‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. అధికారం కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఇక 1983, 1985, 1994, 1999ల్లో గజ్వేల్‌లో టీడీపీ గెలిచింది. టీడీపీ ప్రభుత్వమే ఏర్పడింది. 2004, 2009ల్లో కాంగ్రెస్ గెలిచింది. అధికారం కూడా చేపట్టింది.
2014, 2018ల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి గజ్వేల్‌ నుంచే పోటీ చేస్తోన్న బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలని పట్టుదలతో ఉన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మరి కేసీఆర్ గెలుస్తారా.. ఈటల రాజేందర్ (Eetela Rajender) గెలుస్తారా.. కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి గెలుస్తారా అన్నది డిసెంబర్ 3న తేలనుంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleపాకిస్థాన్‌‌కు షాక్ ఇచ్చిన న్యూజిలాండ్.. మరి భారత్‌తో తలపడేదెవరు..?
Next articleమెదక్‌‌లో పోటీ నుంచి తప్పుకుంటారా.. మైనంపల్లి వ్యూహమేంటి..?