మెదక్‌‌లో పోటీ నుంచి తప్పుకుంటారా.. మైనంపల్లి వ్యూహమేంటి..?

0
మెదక్‌ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్ రావు పోటీ నుంచి తప్పుకుంటారా..? అందుకే మైనంపల్లి హనుమంతరావు భార్య వాణి మెదక్ నుంచి నామినేషన్ వేశారా..? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మెదక్‌ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్ రావు కాంగ్రెస్ బీ ఫామ్‌తో గురువారం నామినేషన్ వేశారు. అయితే మైనంపల్లి హనుమంతరావు భార్య శుక్రవారం మెదక్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం ఆసక్తిని రేపుతోంది. కొడుకును తప్పించి తల్లి బరిలో ఉంటారా అన్నది 15వ తేదీలోపు తేలనుంది.
కాంగ్రెస్ మొదటి జాబితాలో మెదక్‌ టికెట్ దక్కించుకున్న రోహిత్ రావు ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే రోహిత్ రావు నామినేషన్‌లో ఏవైనా సమస్యలు తలెత్తితే ఇబ్బంది ఎదురుకాకుండా ఉండేందుకే వాణితో నామినేషన్ వేయించినట్లు చెబుతున్నారు.
మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మా దేవేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleగజ్వేల్‌లో మరోసారి సెంటిమెంట్‌ రిపీట్ అవుతుందా.. గతంలో ఏం జరిగింది..?
Next articleఎల్లుండే తొలి సెమీస్‌ మ్యాచ్.. ఆ ఇద్దరినే వదిలేసిన రోహిత్‌ శర్మ