వన్డే వరల్డ్‌కప్‌లో ఒక బ్యాటర్ బాగా ఆడి పరుగుల వరద పారించినా భారత్‌కు కప్ దూరం కావడం ఇది రెండోసారి. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ (Sachin) 673 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 20 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) 765 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ ఈ రెండుసార్లు ఆస్ట్రేలియానే టీమిండియాను ఓడించింది. అప్పుడు సచిన్, ఇప్పుడు విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచారు.
మరోవైపు ఆస్ట్రేలియా టీమ్‌లో ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, మ్యాక్స్ వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్‌లకు ఇది రెండో వన్డే వరల్డ్‌కప్ టైటిల్. 2015లో కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్‌లోనూ ఈ ఏడుగురు ఉన్నారు.