మరో వారం రోజుల్లో భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మిడిలార్డర్‌ బ్యాటర్‌..?

0
టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో ఆఖరి సిరీస్‌ ఆడనుంది. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ అనంతరం స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ మొదలుకానుంది. వచ్చే ఏడాది జనవరి 11న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
అయితే ఇప్పటివరకు టీ20ల్లో భారత జట్టు కెప్టెన్లుగా వ్యవహరించిన హార్ధిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌లు గాయపడ్డారు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో గాయపడిన హార్ధిక్‌.. కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సౌతాఫ్రికా పర్యటనలో గాయపడిన సూర్య, రుత్‌రాజ్‌ సైతం పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పట్టొచ్చని తెలుస్తోంది.
దీంతో భారత జట్టు కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఫోకస్ పెట్టింది. అయితే గత కొంత కాలంగా టీ20లకు దూరంగా ఉంటున్న టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఇదే అంశంపై మాట్లాడినట్లు తెలిసింది. అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాలని కోరినట్లు సమాచారం.
అయితే హిట్‌మ్యాన్‌ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొంత సమయం అడిగినట్లు తెలిసింది. ఒక వేళ రోహిత్‌ అందుకు అంగీకరించకపోతే.. అఫ్గానిస్తాన్‌ సిరీస్‌లో జట్టు పగ్గాలను మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు అప్పగించే అవకాశం ఉంది.
శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పటికే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రేయస్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లలో అదరగొట్టిన అయ్యర్‌.. ఇప్పుడు టెస్టుల్లో తన మార్క్‌ను చూపిస్తున్నాడు.
Feedback & Advertisements: newsbuzonline@gmail.com
Previous articleమూడోసారి గ్రూప్-2 పరీక్షలు వాయిదా.. ఈసారి కారణం ఒక్కటే..
Next articleఅంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్.. వైసీపీ నుంచి ఎంపీగా పోటీ