Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ, కేటీఆర్ పోటీ..

0
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఈ అంశంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే సోనియాగాంధీని కూడా తెలంగాణ నుంచే పోటీ చేయించేలా పీసీసీ తీర్మానం చేసింది. ఖమ్మం నుంచి సోనియాగాంధీ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ కూడా ప్రధాని మోదీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని భావించింది. కానీ బీజేపీ అగ్రనేతలెవరూ తెలంగాణ నుంచి పోటీ చేయరని పార్టీ ప్రకటించింది. 2019లో నాలుగు ఎంపీల సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి డబుల్ డిజిట్‌ మార్క్‌కు చేరాలని లెక్కలు వేస్తోంది.
ఇక బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఈసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇక సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా‌ ఉన్న కేటీఆర్.. మాల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ సీట్లను బీఆర్‌ఎస్ గెలిచింది. ఇక సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో 6 అసెంబ్లీ సీట్లను బీఆర్‌ఎస్, ఒక సీటు ఎంఐఎం గెలిచింది. ఈ రెండింటిలో ఏదో ఒక స్థానం నుంచి కేటీఆర్ పోటీ చేసే అవకాశం ఉందని.. అయితే మాల్కాజిగిరి నుంచే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది.
గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో 9 బీఆర్ఎస్ గెలిచింది. 4 బీజేపీ, 3 కాంగ్రెస్, హైదరాబాద్ ఎంపీ సీటును ఎంఐఎం దక్కించుకుంది.
Contact Us: newsbuzonline@gmail.com
Previous articleబీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నిక..
Next articleముగ్గురు సలహాదారులను నియమించిన తెలంగాణ సర్కార్