మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇండియా కూటమి నేతల ప్రకటనలే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి.
బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పాటు చేశారు. కానీ రోజుకో పార్టీ ఆ కూటమికి షాకిస్తోంది. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉంది TMC. అయితే ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ చేసిన ప్రకటన మాత్రం ఆ కూటమి ఏర్పాటుకు కారణమైన లక్ష్యాన్ని దెబ్బ కొట్టేలా ఉంది. పశ్చిమ బెంగాల్లో TMC ఒంటరిగానే పోటీ చేస్తుందని మమతా బెనర్జీ ప్రకటించడం సంచలనంగా మారింది. బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని కూడా క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇండియా కూటమిలో ఉన్న JDU పార్టీ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఇందుకు కారణం బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడమే. గత ప్రభుత్వాలు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదని.. ఇప్పటికీ ప్రకటించారన్నారు. దీంతో మరోసారి నితీష్ యూటర్న్ తీసుకోబోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమిలో ఉంటారా.. లేదా అన్నది త్వరలోనే తేలనుంది. ఎన్నికల వరకు ఎన్ని పార్టీలు కూటమిలో ఉంటాయో చూడాలి.
ఇండియా కూటమి నేతలు సీట్ల సర్దుబాటు గొడవల్లో ఉంటే.. ప్రధాని మోదీ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఎన్నికల వరకు ఎన్ని పార్టీలు కూటమిలో ఉంటాయో చూడాలి