పొత్తులో పంచాయితీ.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటి..?

0
ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. టీడీపీ- జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ.. టీడీపీ- జనసేన కూటమితో కలుస్తుందా.. లేక ఒంటరిగా పోటీ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. టీడీపీతో సీట్ల సర్దుబాటుపై పలుమార్లు చంద్రబాబుతో చర్చించిన పవన్ కల్యాణ్.. త్వరలోనే మరోసారి సమావేశం అవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు పవన్ కల్యాణ్. టీడీపీ రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించిందని.. అందుకే తాను రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజోలు, రాజానగరంలో జనసేన అభ్యర్థులను పవన్ ఫైనల్ చేయడంతో టీడీపీ ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
మరోవైపు వైసీపీ నేతలకు కష్టమొస్తే తన దగ్గరకు రావాలని కూడా సూచించారు పవన్. వైసీపీ టికెట్ దక్కని నేతలను ఉద్దేశించే పవన్ ఇలా మాట్లాడారని చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ జనసేనలో చేరగా.. ఎంపీ బాలశౌరి చేరుతానని ప్రకటించారు. మరి టికెట్ దక్కని వైసీపీ నేతలు జనసేనలో ఇంకా ఎంత మంది చేరుతారో త్వరలోనే తేలనుంది.
Previous articleమూడోసారి మోదీకే జై.. ముందే ఇండియా కూటమికి నేతల గుడ్ బై!