దేశంలో లాక్‌డౌన్‌పై చర్చ.. మరోసారి సీఎంలతో మోడీ మీటింగ్..

0
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజుకు 10 వేలకు పైగా నమోదు కావడం ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది. అన్‌లాక్ 1.O ప్రారంభమైన దగ్గరి నుంచి కేసులు పెరుగుతుండడంతో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఓ వైపు మరోసారి లాక్‌డౌన్‌ విధించాలన్న చర్చ సాగుతుండగానే.. మరోవైపు ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో ఈ నెల 16, 17 తేదీల్లో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్న ప్రధాని మోడీ.. సీఎంలతో రెండు రోజుల పాటు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. రెండు రోజుల పాటు మధ్యాహ్నం 3 గంటల నుంచి సమాలోచనలు జరుపుతారు.
ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఏపీ, తెలంగాణ సీఎంలతో ప్రధాని మోడీ ఈ నెల 17వ తేదీన మాట్లాడుతారు. ఈ సమావేశంలో కరోనా కట్టడి‌పైనే ప్రధానంగా చర్చిస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆర్థిక రంగం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న తరుణంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదని చెప్తున్నారు. అన్‌లాక్ 1.O ప్రారంభమైన తర్వాత ప్రధాని మోడీ.. సీఎంలతో మాట్లాడటం ఇదే తొలిసారి.
కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రులు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారాన్ని పంపుతున్నట్లు తెలిసింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleబిడ్డకు “ఉద్యోగం” కల్పించడంలో ఉన్న ఆతృత… అంటూ రేవంత్ రెడ్డి ఫైర్
Next articleతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇద్దరిలో ఒక్కరికి ఛాన్స్.. ప్రకటనే తరువాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here