ఐపీఎల్ (IPL) లో అద్భుతంగా రాణించిన బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), తిలక్‌వర్మ (Tilak Varma)లకు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్‌తో (West Indies Tour) ఆగస్టు 3న మొదలయ్యే ఐదు టీ20ల సిరీస్‌కు వీరిద్దరిని ఎంపిక చేశారు. హైదరాబాద్ నుంచి పేసర్ మహ్మద్ సిరాజ్ ఇప్పటికే టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా ఉండగా.. ఇప్పుడు ఇక్కడి నుంచి మరో కుర్రాడు భారత జట్టులో చోటు సంపాదించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మకు భారత సెలక్టర్లు ‘తొలి’ అవకాశం అందించారు.
మరోవైపు వెస్టిండీస్‌తో జరిగే ఐదు టీ20 మ్యాచ్‌లకు జట్టు పగ్గాలు హార్ధిక్ పాండ్యాకు అప్పగిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అయితే వెస్టిండీస్ టూర్ వెళ్లే భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కలేదు. వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్‌లలో మాత్రం రోహిత్, విరాట్ కోహ్లీ ఆడనున్నారు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి కూడా తిరిగి టీ20 జట్టులో స్థానం దక్కింది. చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టాక ఆయన నేతృత్వంలో ఆడుతున్న తొలి భారత జట్టు ఇదే.
భారత T20 టీమ్: ఇషాన్ కిషన్ (WK), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ, సూర్యకుమార్ యాదవ్ (VC), సంజు శాంసన్ (WK), హార్దిక్ పాండ్యా(C), అక్షర్‌పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్‌యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్‌సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్‌ఖాన్, ముఖేష్‌కుమార్.
India's T20I squad: Ishan Kishan (wk), Shubman Gill, Yashasvi Jaiswal, Tilak Varma, Surya Kumar Yadav (VC), Sanju Samson (wk), Hardik Pandya (C), Axar Patel, Yuzvendra Chahal, Kuldeep Yadav, Ravi Bishnoi, Arshdeep Singh, Umran Malik, Avesh Khan, Mukesh Kumar.
— BCCI (@BCCI) July 5, 2023