ఈ పండు తింటే ఇన్ని లాభాలున్నాయా?

0

శీతాకాలంలో విరివిగా దొరికే పండ్లలో సీతాఫలం ఒకటి. సహజ చక్కెరలతో నిండిన ఈ ఫలం చర్మ, కురుల సోయగాన్ని పెంచుతుంది. ఈ సీజన్‌లో ప్రతిరోజు ఒక సీతాఫలం తింటే అలసట తగ్గిపోతుంది.

-> దీనిలో పీచుపదార్థం ఎక్కువ. ఇది రక్తంలోకి చక్కెర విడుదలను ఆలస్యం చేసి టైప్‌-2 డయాబెటీస్‌ రాకుండా చూస్తుంది.
-> ఈ పండు తింటే శరీరంలో నీటి నిల్వలు పెరుగుతాయి. అలసట తగ్గిపోతుంది.
-> సీతాఫలంలోని విటమిన్‌ సి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
-> సీతాఫలం ఆకుల కషాయాన్ని గాయాల మీద రుద్దితే త్వరగా మానిపోతాయి.
-> ఈ పండులో కార్బోహైడ్రేట్స్‌, పొటాషియం, ఫైబర్‌, విటమిన్లు, లవణాలు పుష్కలం. కొలెస్ట్రాల్‌ తక్కువ. సోడియం కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది.
-> డోపమైన్‌, సెరటోనిన్‌ వంటి న్యూరోట్రాన్స్‌మీటర్ల ఉత్పత్తికి అవసరమైన విటమిన్‌ బి6 సీతాఫలంలో సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్‌ బి6 ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, ఆస్తమాను నివారిస్తుంది.
-> ఈ పండు తింటే చర్మం మీద ముడతలు, గీతలు, తగ్గిపోతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
-> దీనిలోని విటమిన్‌ A- కళ్లు, వెంట్రుకలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండు గుజ్జును సెగగడ్డల మీద రాస్తే ఫలితం ఉంటుంది.
-> దీనిలోని ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కేన్సర్‌, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. సీతాఫలంలోని మెగ్నీషియం, పొటాషియం రక్తపీడనాన్ని అదుపులో ఉంచుతాయి. హృదయ కండరాలను రిలాక్స్‌ చేస్తాయి.
-> సీతాఫలం గుజ్జుతో తేనె కలుపుకొని ప్రతిరోజు తింటే కావాల్సిన క్యాలరీలు అందడమే కాదు బరువు కూడా పెరుగుతారు.
-> గర్భిణులు సీతాఫలం తింటే పుట్టబోయే బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతాయి. పురిటి నొప్పులు కొంత వరకూ తగ్గుతాయి.
-> ఈ పండు తింటే రక్తహీనత సమస్య ఉండదు. దీనిలోని ఐరన్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ నిల్వలను పెంచుతుంది.

Previous articleవిటమిన్ బి6 విశేషాలు
Next article1932లో ఆర్టీసీ ఎలా మొదలైంది? ఎంత మంది కార్మికులుండే వారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here