కాసేపట్లో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తారు. గెలిచిన ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో సమావేశమైన కేసీఆర్.. త్వరలోనే తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించి ప్రతిపక్ష నేతను ఎన్నుకుందామని చెప్పారు. మరి BRS పక్షనేతగా ఎవరుంటారు.. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గులాబీ బాస్ కేసీఆర్ BRS పక్షనేతగా ఎవరిని ఎంపిక చేస్తారోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను BRS పక్షనేతగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ మరికొందరు నేతల పేర్లను కూడా కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది. ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీష్ రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల్లో ఒకరిని BRS పక్షనేతగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
2004లో టీఆర్ఎస్ ఎల్పీ లీడర్‌గా విజయరామరావు వ్యవహరించారు. 2009లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ కరీంనగర్, మహబూబ్‌నగర్ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో కేటీఆర్ ఫస్ట్ టైమ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.