సమయం లేదు మిత్రమా.. రేపే లాస్ట్.. కాంగ్రెస్, బీజేపీ నేతల్లో టెన్షన్

0
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 3న మొదలైన నామినేషన్ల పర్వం.. రేపటితో ముగుస్తోంది. కొందరు అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మరికొంతమంది ఇవాళ, రేపు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ‘మంచి ముహూర్తం‘ ఉందన్న కారణంగా కీలక నేతలు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఉదయం 11-12 గంటలకు గజ్వేల్‌లో,.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కామారెడ్డిలో రెండు సెట్ల చొప్పున నామినేషన్లు సమర్పిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పత్రాలపై కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కేసీఆర్ సంతకం కూడా చేశారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, సిద్ధిపేటలో ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు కూడా ఇవాళ నామినేషన్ వేస్తారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా నామినేషన్లు వేయనున్నారు. నిన్న ఒక్క రోజే తెలంగాణ వ్యాప్తంగా 618 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ఇంకా పలు స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. ఏ క్షణమైనా జాబితా విడుదల చేస్తారని రెండు పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటివరకు 114 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా ఒక సీటు సీపీఐకి కేటాయించింది. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇక బీజేపీ ఇప్పటికే 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా 8 స్థానాలను జనసేన పార్టీకి కేటాయించింది. జనసేన కూడా 8 మంది అభ్యర్థులను ప్రకటించి.. బీఫామ్‌లను అందజేశారు. మరో 11 సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleWorld Cup: మరోసారి భారత్ Vs పాకిస్థాన్‌.. కానీ ఇలా జరిగితేనే..!
Next articleపాకిస్థాన్‌‌కు షాక్ ఇచ్చిన న్యూజిలాండ్.. మరి భారత్‌తో తలపడేదెవరు..?