BRS Once Again: సమయం లేదు మిత్రమా.. KCR సారొస్తున్నారు..

0
అలా ఎన్నికల షెడ్యూల్ రావడమే ఆలస్యం గులాబీ బాస్ కేసీఆర్ (KCR).. నియోజకవర్గాల పర్యటన తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 15న BRS ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అవుతారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీ-ఫారాలను కేసీఆర్ అందజేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారు.
అనంతరం అదే రోజు (అక్టోబర్ 15)న హైదరాబాద్ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో బీఆర్ఎస్ అధినేత పాల్గొంటారు.
అక్టోబర్ 18న.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి… రెండు నియోజకవర్గాల నుంచి కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. అంతకుముందు 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సీఎం కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. అనంతరం 3 గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

Elections2023: అప్పుడు TRSకు కలిసొచ్చిన ముందస్తు.. మరి ఇప్పుడు BRSకు.. ?

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleElections2023: అప్పుడు TRSకు కలిసొచ్చిన ముందస్తు.. మరి ఇప్పుడు BRSకు.. ?
Next articleTelangana Congress: ఆరు వారాలు.. ఆరు హామీలు.. రేవంత్ రెడ్డి కొత్త నినాదం