కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు పూర్తైంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 13-14 తేదీల్లో ప్రధాని మోదీ (Modi) ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నారు. ఆ లోపే మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై కసరత్తు పూర్తయిందని, దాని ప్రకారమే పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. గవర్నర్లు, ముఖ్యమంత్రుల మార్పులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కిరణ్ రిజిజును న్యాయశాఖ బాధ్యతల నుంచి తప్పించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణ నుంచి ఇద్దరికి.. ఏపీ నుంచి ఒక్కరికి కేబినెట్‌లో చోటు కల్పిస్తారని తెలిసింది.
4 రోజుల క్రితం కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రాం మేఘ్వాల్, భూపేంద్ర యాదవ్, గజేంద్రసింగ్ షెకావత్, ఎస్పీఎస్ బఘేల్, ప్రహ్లాద్ జోషి సహా పలువురు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌లను కలిశారు. ఆ తర్వాత ప్రహ్లాద్ జోషి, భూపేంద్ర యాదవ్‌లకు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 2021 జూలై 7 తర్వాత మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. అప్పు డు ప్రకాశ్ జావదేకర్, రవిశంకర్‌ప్రసాద్ సహా 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికి 36 మంది కొత్త వారికి స్థానం కల్పించారు. ఈసారి కూడా మార్పులు భారీగానే ఉంటాయంటున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com