ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటారు. నిజానికి 1959కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1959 నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని ప్రపంచమంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ, భారత్‌లో మాత్రం ఆరు రోజులు ముందుగానే దీన్ని నిర్వహించుకుంటారు.
1964లో నెహ్రు చనిపోయిన తరువాత ఆయన పుట్టిన రోజైన నవంబర్14న చిల్డ్రన్స్ డే జరుపుకొంటున్నాం. బాలల దినోత్సవం రోజున అన్ని పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధానిగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పిల్లలంటే చాలా అభిమానం. పిల్లలతో గడిపే సమయం మనసుకు ఎంతో హాయినిస్తుంది అని నెహ్రూ ఎప్పుడూ చెప్తుండేవారు. పిల్లలు కూడా అంతే ప్రేమగా నెహ్రూని ‘చాచా’ అని పిలిచేవారు.
బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. చైనాలో జూన్ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోజు పాఠశాలలు తెరిచివున్నా క్లాసులు నిర్వహించరు.
పాకిస్తాన్‌లో నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆ రోజున పాఠశాలలు మామూలుగానే నడుస్తాయి. టీవీలు, రేడియోల్లో మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు.
జపాన్‌లో మే 5న జరుపుకుంటారు. ఆరోజున మగపిల్లలున్న వారు చేప ఆకారంలో వున్న గాలిపటాలను ఎగురవేస్తారు. అంతేకాక యుద్ధవీరుల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేస్తారు. ఆరోజు జాతీయ సెలవుదినం.
దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున ఇక్కడ పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారు ఎప్పుడూ గుర్తుంచుకునేలా పెద్దలు పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళతారు.
పోలాండ్ లో జూన్ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. ఆ రోజున స్కూళ్లల్లోనే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పార్కుల్లో, వినోద కేంద్రాలలో పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
శ్రీలంకలో అక్టోబర్ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు. ఇళ్లల్లో వారికోసం ప్రత్యేకంగా స్వీట్లు చేస్తారు.
Feedback: newsbuzonline@gmail.com
Your article helped me a lot, is there any more related content? Thanks!