Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే విచారణలో భాగంగా ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన ED.. కొందరిని అరెస్ట్ కూడా చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో BRS MLC కవిత కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది.
అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి కూడా ఈడీ విచారణకు హాజరుకాలేదు. నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లో ఈడీ విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ నిరాకరించారు. నిన్న మూడోసారి నోటీసులు ఇచ్చినా.. కేజ్రీవాల్ విచారణకు వెళ్లలేదు. నిబంధనల ప్రకారం కేజ్రీవాల్‌పై ఎప్పుడైనా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి.. అరెస్ట్ కూడా చేయొచ్చు.
కేజ్రీవాల్‌ను ఇవాళ ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు చెప్తున్నారు. కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు చేసి.. అనంతరం అరెస్ట్ చేయనుందని ట్వీట్లు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని AAP నేతలు ప్రకటించారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కేజ్రీవాల్‌ను ఆపాలనే ఈడీ విచారణకు పిలుస్తోందని ఆరోపిస్తున్నారు.
News coming in that ED is going to raid @ArvindKejriwal’s residence tmrw morning. Arrest likely.
— Atishi (@AtishiAAP) January 3, 2024