24 గంటల్లో 730 మందికి వైరస్.. 2 నిమిషాలకో కొత్త కేసు..జూన్ 1నుంచి ఇప్పటివరకు 128మంది మృతి.. దీనిని బట్టి తెలంగాణలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రతి నాలుగు నమూనాల్లో ఒకరికి వైరస్ సోకుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది..గడిచిన 24 గంటల్లో కొత్తగా 730 కేసులు నమోదయ్యాయి. అంటే రెండు నిమిషాలకో కొత్త కేసు వచ్చింది. ఒక్కరోజులో ఇంత భారీగా పాజిటివ్‌లు రావడం ఇదే తొలిసారి. గడిచిన ఐదు రోజుల్లోనే 2396 మంది మహమ్మారి బారిన పడ్డారు. అంటే రోజుకు సగటున 479 మందికి వైరస్ సోకింది. ఆదివారం 730 కేసులు నమోదవగా.. అందులో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 659 మందికి వైరస్ సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో ఈ నెలాఖరుకు 10 వేల కేసులు నమోదవుతాయని వైద్యఆరోగ్యశాఖ అంచనా వేయగా.. అంతకంటే ఎక్కువగానే కేసులొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.శనివారం నుంచి ఆదివారం వరకు 3297 నమూనాలు సేకరించగా 730 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే ప్రతి 4 నమూనాల్లో ఒకరికి వైరస్ సోకింది. అలాగే పాజిటివ్ రేటు 22.14గా నమోదైంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారిసంఖ్య 7వేల 802కు చేరగా 3వేల 861 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించకముందు అంటే మార్చి 22కు ముందు సరిగ్గా 22 కేసులే ఉన్నాయి. కానీ అన్‌లాక్-1 మొదలవగానే వైరస్ తీవత్ర ఒక్కసారిగా పెరిగింది. జూన్ 1నుంచి ఇప్పటివరకు 5వేల 104 మంది వైరస్ బారినపడ్డారు. టెస్టుల సంఖ్యను పెంచడంతో కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి కన్పించని శత్రువుతో పోరాడుతున్న వారిలో వైద్య సిబ్బంది ముందుంటున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ప్రస్తుతం ఒకరి తర్వాత మరొకరు వైరస్ బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. 200 మంది వైద్య సిబ్బంది క్వారంటైన్‌లో ఉండగా.. వీరిలో 72 మంది వైద్యులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు హైదరాబాద్ పోలీసు శాఖలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 170మంది పోలీసులు వైరస్ బారినపడగా.. నలుగురు పోలీసులు మృతిచెందారు.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.