కరోనా ఎఫెక్ట్‌తో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఓ వైపు పెరుగుతున్న పాజిటివ్ కేసుల భయం.. మరోవైపు ఎవరి ద్వారా ఎవరికి సోకుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
కుటుంబసభ్యులు సహా సమీపంలో ఎవరైనా తుమ్మినా, దగ్గిన వైరస్ భయంతో వణికిపోతున్నారు. తప్పనిసరి సేవలందించే పోలీస్, వైద్య తదితర కార్యాలయాల్లో అయితే ఇలాంటి వారిని అనుమానాస్పదంగా చూస్తున్నారు.
సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారిని కూడా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో దూరం పెడుతున్నారు. ఇలా ఎన్ని రోజుల గడపాల్సి వస్తుందో తెలియక ఒత్తిడికి గురవుతున్నారు. త్వరగా ఈ వైరస్ వ్యాప్తి తగ్గితే చాలన్న భావనలో చాలా మంది ఉన్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com