బీ కేర్‌ఫుల్: కరోనా వైరస్ సోకిన వారిలో మరో ఆరు లక్షణాలు..

0
దగ్గు, జర్వం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. కరోనా సోకిన వారిలో కనిపించే లక్షణాలివి. కానీ వైరస్ సోకిన వారిలో ఈ మూడు లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) స్పష్టం చేసింది.
కరోనా లక్షణాల జాబితాలో కొత్తగా మరో ఆరింటిని చేర్చింది. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త వహించాలని, వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఈ లక్షణాలు చాలా మందిలో సాధారణంగా ఉంటాయని కొంతమందిలో తీవ్ర స్థాయిలో ఉంటాయని తెలిపింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతిలో నొప్పి, పెదవులు కానీ ముఖం కానీ నీలి రంగులోకి మారడం లాంటివి ఎమర్జెన్సీకి సంకేతాలని, ఈ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది.
CDC కొత్తగా చెప్పిన ఆరు లక్షణాలు
చలిగా అనిపించడం
వణుకు
కండరాల నొప్పి
తలనొప్పి
రుచి లేదా వాసన గ్రహించలేకపోవడం
గొంతు నొప్పి, మంట
కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక 2 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాలు బయటపడవచ్చునని తెలిపింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleటీఆర్ఎస్ ప్రస్థానంపై హరీష్ రావు రాసిన సువర్ణాక్షరాలు
Next articleఆరోగ్య సేతు యాప్ ద్వారా కరోనా వైరస్‌ను అడ్డుకోగలమా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here