ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలిస్తోందా..?

0
తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న BRS, కేంద్రంలో అధికారంలో ఉన్న BJP, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ ప్రభావం కనిపిస్తోంది. కర్నాటక ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు BJPలో చేరుతారని ప్రచారం జరిగింది. BJP చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ MLA ఈటల రాజేందర్.. పొంగులేటి, జూపల్లితో సమావేశం కూడా అయ్యారు. BJPలో చేరాలని ఆ ఇద్దరు నేతలను ఈటల ఆహ్వానించారు. కానీ కర్నాటక ఫలితాలతో సీన్ మారింది.
BRS పార్టీ నుంచి బయటికొచ్చిన నేతలు, KCRను వ్యతిరేకించే నాయకులు కాంగ్రెస్‌లో చేరాలని TPCC చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. BJP- BRS పార్టీలు రెండు ఒక్కటేనని చెప్పుకొచ్చారు. జరుగుతున్న పరిణామాలు కూడా రేవంత్ రెడ్డి చెప్పిందే నిజం అనేలా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో BRS MLC కవిత అరెస్ట్ కాకపోవడంతో BJP-BRS ఒక్కటేనన్న వాదన వినిపిస్తున్నారు. CM కేసీఆర్‌ కూడా కర్నాటక ఫలితాల తర్వాత BJPని వదిలేసి కాంగ్రెస్‌నే విమర్శిస్తున్నారు.
KCRను గద్దె దించాలనే లక్ష్యంతో BJPలో చేరిన నేతలు కూడా ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. BJP అగ్రనేతల వైఖరి మారకపోతే ఆ పార్టీ నుంచి బయటికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. KCR అవినీతిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఈటల, BJP నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు.. మూడు రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleElections-2023: గజ్వేల్‌లో KCR Vs ఈటల రాజేందర్..?
Next articleఓ పనై పోయింది.. ఆ ఇద్దరు చేరుతున్నారు.. కాంగ్రెస్‌లో షర్మిల చేరుతారా..?