క‌స్ట‌మ‌ర్ల‌కు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్.. మిగితా కంపెనీలకు చెక్

0
లాక్ డౌన్ నేప‌థ్యంలో కూడా లాభాలు అర్జించిన కంపెనీల్లో ఫ్లిప్‌కార్ట్ ఒక‌టి. వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని మూత‌ప‌డడంతో చాలామంది అన్ లైన్ ఆర్డ‌ర్స్ ప్రక్రియనే ఎంచుకుంటున్నారు. దీంతో ఫ్లిప్‌కార్ట్ కి క‌స్టమ‌ర్లతో పాటు ఆదాయం కూడా పెరిగింది. ఈనేప‌థ్యంలో ఫ్లిప్‌కార్ట్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వస్తువులను 90 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు ఫ్లిప్‌కార్ట్ షాకిచ్చింది. ఇక నుంచి గ్రాసరీస్, హోమ్ యాక్ససిరీస్ లను కొనుగోలు చేస్తే కేవలం గంటన్నరలో అందిస్తామని తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ క్విక్ పేరుతో ఈ హైపర్ లోకల్ సర్వీసులు ఆఫర్ చేయనుంది. రాబోయే రోజుల్లో మొబైల్ ఫోన్లను కూడా వేగంగా డెలివరీ చేస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు బెంగళూరులోని కొన్ని ప్రాంతాలల్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఇవి అమల్లోకి రానున్నాయి. గూగుల్‌కు చెందిన డుంజో, స్విగ్గీ కూడా భారత్‌లో గ్రాసరీస్‌ను డెలివరీ చేస్తున్నాయి. వైరస్ ప్రభావంతో అన్ లైన్ ఆర్డ‌ర్ల‌కు డిమాండ్ పెర‌గ‌డంతో దానికి తగ్గట్టుగా కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. జియో మార్ట్ కు కూడా ఫ్లిప్‌కార్ట్ ఝలకిచ్చిందని చెప్పాలి.
ఫ్లిప్‌కార్ట్ ఒక అడుగు ముందుకు వేసి మొబైల్ ఫోన్లను కూడా వేగంగా అందిస్తామని ప్రకటించడంతో ఇతర కంపెనీలకు గట్టి షాకిచ్చినట్టైంది. ప్రస్తుతం గ్రాసరీస్ డెలివరీ చేస్తున్న కంపెనీలు కొన్ని గంటల సమయం తీసుకుంటున్నాయి. వాటికి షాకిచ్చేలా ఫ్లిప్‌కార్ట్ కేవలం గంటన్నరలో వస్తువులు డెలివరీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ కు అమ్మ‌కాలతో పాటు రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని కంపెనీ యాజ‌మాన్యం భావిస్తోందట.
Previous articleభారత్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోన్న కరోనా.. మరణాలు కూడా భారీగానే..
Next articleకరోనా టెస్ట్‌లు ఎన్ని రకాలు.. ఏ టెస్ట్ ద్వారా ఫలితం తొందరగా వస్తుంది..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here