హైదరాబాద్‌‌లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌ జరిగేనా.. HCA ఏం చెప్పింది..?

0
డిసెంబరు 3న హైదరాబాద్‌‌లో జరగాల్సిన భారత్- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ వేదిక మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నవంబరు 23న విశాఖలో తొలి టీ20తో సిరీస్ ప్రారంభంకానుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ హైదరాబాద్‌‌లో జరగాల్సి ఉంది.
అయితే అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని రాచకొండ సీపీ HCAకు తెలిపినట్టు సమాచారం. ఇదే విషయంపై HCA (హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌).. బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నాయి. HCA ఈ మ్యాచ్‌ షెడ్యూల్‌ను మార్చాలని బీసీసీఐని కోరినట్టు తెలుస్తోంది. నవంబర్‌ 23న వైజాగ్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను హైదరాబాద్‌కు తరలించి.. డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను వైజాగ్‌కు తరలించాలని కోరినట్టు సమాచారం. టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగుతుందా.. లేదా అన్నది మరో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleషర్మిల పోటీ చేసే స్థానంపై క్లారిటీ.. పాలేరు నుంచి కాదు..!
Next articleబీజేపీకి బిగ్ షాక్.. రాకేష్‌ రెడ్డి రాజీనామా.. కిషన్‌ రెడ్డికి పలు ప్రశ్నలు