బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రతను పెంచారు పోలీసులు. ఇటీవలే అరెస్ట్ అయిన ఉగ్రవాదుల హిట్ లిస్టులో రాజాసింగ్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజాసింగ్ ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సైతం బైక్‌పై తిరగవద్దని.. ప్రభుత్వం ఇచ్చిన బులెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లాలని సీపీ సూచించారు. డీసీపీ స్థాయి అధికారితో రాజసింగ్ భద్రతా పర్యవేక్షణకు చర్యలు చేపట్టారు.
మరోవైపు ఎమ్మెల్యే రాజా సింగ్ తన భద్రతను పెంచడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన గన్ మెన్ గన్స్ కూడా మార్చారని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందొ చెప్పాలని డిమాండ్ చేశారు. టెర్రరిస్టుల నుండి ఉందా ,లేదా స్థానికంగా ఉండే ఏదైనా సంస్థల నుండి ఉందో స్పష్టం చేయాలని కోరారు. ఇక దీనిపై రాష్ట్ర హోంమంత్రికి, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని తెలిపారు.
అసలు రాజాసింగ్‌ని ఎందుకు టార్గెట్ చేశారు. ఎక్కడో ఉండే ఉగ్రవాదులకు ఆయన ఎందుకు ఫోకస్ అయ్యారు..ఇలా చాలా అంశాలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారు. అలాంటి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాణాలకే ముప్పు ఉందని పోలీసులే హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Your article helped me a lot, is there any more related content? Thanks!