తెలంగాణలో పలువురు IASల బదిలీ.. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు..

0
తెలంగాణ ప్రభుత్వం పలువురు IAS అధికారులను బదిలీ చేసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో సహా వివిధ శాఖలకు పలువురు అధికారులను బదిలీ చేసింది. IAS ఆమ్రపాలిని HMDA జాయింట్ కమిషనర్‌గా నియమించారు. అలాగే మూసీ రివర్ డెవలప్‌మెంట్‌ బోర్డు MDగానూ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆమ్రపాలి తెలంగాణ నుంచి మూడేళ్ల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా బదిలీపై వెళ్లారు. కేంద్ర సర్వీసులో మూడేళ్లు పూర్తికావడంతో ఆమ్రపాలి అక్కడి నుంచి రిలీవై తెలంగాణ సీఎస్‌కు రిపోర్ట్ చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించింది.

ఇంధన శాఖ కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్విని నియమించిన ప్రభుత్వం.. ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్, సీఎండీగానూ రిజ్వికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బి. గోపిని నియమించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్కర్‌
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌.
ట్రాన్స్‌కో జేఎండీగా సందీప్‌కుమార్‌ ఝూ.
TSSPDCL సీఎండీగా ముషారఫ్‌ అలీ.
TSNPDCL సీఎండీగా కర్నాటి వరుణ్‌ రెడ్డి.
Feedback & Advertisements: newsbuzonline@gmail.com
Previous articleస్మితా సబర్వాల్‌ అలా క్లారిటీ ఇచ్చారు.. ఇలా సచివాలయంలో..
Next articleమూడోసారి గ్రూప్-2 పరీక్షలు వాయిదా.. ఈసారి కారణం ఒక్కటే..