ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను యూజ్ చేస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే

0

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అవసరానికి మించి బ్యాంకు అకౌంట్స్ ను యూజ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ అకౌంట్స్ ఉండటం వల్ల నష్టం లేదు కానీ.. వేరు వేరు అకౌంట్స్ తో జరిపే లావాదేవీలను మర్చిపోతూ వుంటారు. అంతేకాదు ఆదాయపు పన్ను లాంటివి కట్టాల్సిన సమయంలో తలనొప్ఫిగా మారుతాయి. అయితే వాటిని మూసివేయడం అంత పెద్ద కష్టమైన పని కాదు. వెరీ సింపుల్

ఏదైతే అకౌంట్ క్లోజ్ చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన యాప్స్ నుంచి డీటెయిల్స్ తీసేస్తే సరి. ఇక దీంతోపాటు ఆ అకౌంట్ కి సంబంధించిన పాస్ బుక్, ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్ట్ లాంటి వాటిని బ్యాంకుకు సరెండర్ చేసి.. అకౌంట్ మూసివేస్తున్నట్లు బ్యాంకు నుంచి లిఖిత పూర్వకమైన లెటర్ తీసుకుంటే.. మీ అకౌంట్ క్లోజ్ చేసినట్లే.
చాల బ్యాంకులు మినిమం బాలన్స్ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే కష్టమే అవుతుంది. ఇక డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల పేరుతో కొన్ని బ్యాంకులు డబ్బులు దండుకుంటున్నాయి. ఇక సంవత్సరాల తరబడి వున్న అకౌంట్స్ లో కూడా లావాదేవీలు జరుపకపోతే.. వాటిని మూసివేయాలన్నా అందుకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ అందుకు చెల్లించాలిసిన రుసుము కూడా పెరుగుతూ ఉంటుంది.
కొందరు పాత ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు వేరే బ్యాంకు ఆకౌంట్ తీసుకుంటారు. అలాంటప్పుడు పాత శాలరీకి సంబంధిచిన లావాదేవీలను కొత్త శాలరీ అకౌంట్ కి మళ్లిస్తే సరిపోతుంది. ఇక పాత దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనుకుంటే దానిని మూసివేస్తే ఇంకా మంచిది.
Previous articleచిల్డ్రన్స్ డే: ఒక్కో దేశంలో ఒక్కో రోజు.. ఎందుకిలా?
Next articleపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవ వైభవం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here