మనిషి శిఖరం.. మనసు విశాలం..ఒంటరిగా మొలిచి మహావృక్షంగా ఎదిగిన నేత కేసీఆర్. ఏరులా మొదలైన ఉద్యమాన్ని నదిలా మార్చి..తెలంగాణ పతాకాన్ని ఢిల్లి పురవీధుల్లో ఊరేగించి ఘనుడు కేసీఆర్. ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చి..స్వేచ్చా వాయువులు అందించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం చాలా మందికి సాధ్యం కాదు..కానీ కేసీఆర్ తాను ఇచ్చిన మాటను 100శాతం నిలబెట్టుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కడిగా మొదలుపెట్టి.. ఉప్పెనెల మార్చి..ప్రత్యేక రాష్ట్రం సాధించారు. హేమాహేమీలను ఢీకొట్టి తెలంగాణకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టారు.
లోలోపల నివురుగప్పిన ఉద్యమానికి కొత్త జవసత్యాలను జోడించి ఉద్యమాన్ని ఊర్రూతలూగించారు కేసీఆర్.. కేసీఆర్ అనే మూడు అక్షరాలకు రాత్రికిరాత్రే పేరు రాలేదు..అదొక అచెంచెల ఆరాటం..శాంతియుత రాజకీయ పోరాటం..ప్రతి అడుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పాకులాడాడు కేసీఆర్. చెన్నారెడ్డికే సాధ్యం కానిది కేసీఆర్ కు సాధ్యమవుతుందా అని ఎంత మంది వెటకారం ఆడిన..అన్నింటిని భరించి ఉద్యమానికి ఊపిరూలూదారు. తన ఉనికినే ప్రశ్నించిన ఎగతాళి చేసిన..ఆరోపణల వర్షం కురిసినా..రాజీకయంగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలిన..వాటన్నింటిని స్వాగతించి..మృత్యుకుహరం దాకా వెళ్లి మళ్లీ కొత్త జన్మెత్తిన.. ఉవ్వెత్తున ఎగిసిన ఉత్తేజంతో తెలంగాణ ప్రజల కలను నెరవేర్చారు కేసీఆర్.
జూన్ 2 2014 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైతే..తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చి కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కేసీఆర్ పుట్టింది ఫిబ్రవరి 17, 1954. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించారు. సొంత జిల్లాలోనే ప్రాథమిక, ఉన్నత విద్య పూర్తిచేసిన కేసీఆర్.. చిన్నప్పటినుంచే సాహిత్యం, భాష, రాజకీయ అంశాలపై ఆసక్తి చూపించారు. హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో లిటరేచర్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఓ కార్యకర్తగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన ఆయన.. తర్వాత ఎన్టీ రామారావు స్ఫూర్తితో తెలుగుదేశంలో చేరారు.
1983లో మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. తర్వాత అదే నియోజకవర్గం నుంచి 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్.. మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1989, 94, 99, 2001,2004 ఎన్నికలతో కలిపి.. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కేసీఆర్. ఎన్టీఆర్ హయాంలో 1987-88లో కరువు శాఖమంత్రిగా పనిచేసిన చంద్రశేఖర్ రావు.. చంద్రబాబు పాలనలోనూ.. 1996లో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000-2001 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 లో డిప్యూటీ స్పీకర్ పదవిని, టీడీపీ సభ్యత్వాన్ని వదులుకున్నారు కేసీఆర్. హైదరాబాద్ జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్రసమితిని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణ యాస, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలపై మంచి పట్టున్న కేసీఆర్.. తన ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకుని ప్రత్యేక రాష్ట్ర స్పూర్తిని రగలించారు. మాటల నుంచి పాటలు పుట్టించి..పాటల నుంచి పదఘటనలు పుట్టించిన ఘునత కేసీఆర్ ది..ఒక వ్యక్తి వెంట జాతి నడిచిన తీరును చూసి యావత్త దేశం చలించింది. తెలంగాణ ఆవశ్యకతను గుర్తించింది.
2004 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా.. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి కావడంతో.. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా కేసీఆర్ పనిచేశారు. తెలంగాణకు యూపీఏ అనుకూలంగా లేదంటూ కూటమినుంచి బయటికొచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2006, 2008 ఉపఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.2009 నవంబర్ 29 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. ప్రాణం పోయిన తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతానని శపథం చేశారు. ఏళ్లనాటి కలను సాకారం చేయడంలో అదో కీలక మలుపు. ఇలా ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ ప్రజల సాకారం చేసేవరకు కేసీఆర్ సాగించిన పోరాటాన్ని జాతి ఎన్నటికి మరవలేనిది. తెలంగాణ బండికి ఒంటెద్దులా మారి ప్రజల కలను సాకారం చేశారు కేసీఆర్.
కేసీఆర్ ఏ విషయాన్నీ ఆషామాషీగా తీసుకోరు. ఏ సభకూ ముందుగా తయారుకాకుండా, సాకల్యంగా అధ్యయనం చేయకుండా వెళ్లరు. ఆయన నలిగి నలిగి ఎదిగిన నేత. అందుకే ఆయన ప్రసంగాలు జనాన్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇవ్వాళ దేశంలో ఏ రాజకీయ నాయకుడూ స్పృశించని అంశాలను కూడా ఆయన అలవోకగా మాట్లాడగలరు. ఏ సమస్య గురించి అయినా లోతైన అవగాహనతో చర్చించగలరు. ఉద్యమకాలంలో నాయకులు, మేధావుల ఇండ్లకు వెళ్లి గంటలు గంటలు చర్చలుచేసేవారు.
ఉద్యమం మొదలు పెట్టినప్పుడు పలుచని శరీరంలో వజ్రహృదయం ఉందని నాడు ఎవరూ అనుకోలేదు. ఎంతో మంది కుట్రలు పన్నీ తెలంగాణ ఉద్యమం లేదు అని, దాని పని అయిపోయింది అని చాటిచెప్పాలని ప్రయత్నించిన ప్రతిసందర్భంలోనూ ఆయన ఫీనిక్స్‌లా ఉవ్వెత్తున పైకెగసి తెలంగాణ పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు. సమైక్యాంధ్ర ఆధిపత్య శక్తుల లాలూచీలు, బెదిరింపులు, కుట్రలు పటాపంచలుచేస్తూ ముందుకు సాగుతూ వచ్చారు. వందలమంది కొత్తతరం నాయకులను తయారుచేశారు. ఊరికొక కేసీఆర్ తయారయ్యారు. తెలంగాణ ఎందుకుకావాలో చెప్పే ఆట, పాట, మాటలతో తెలంగాణ పల్లెలు, పట్నాలు మారుమోగిపోయాయి.
గత ఆరేండ్లలో తెలంగాణ పల్లెలు, పట్నాల్లో గుణాత్మకమైన అభివృద్ధి వచ్చింది. జీవనప్రమాణాలు పెరిగాయి. సంపద పెరిగింది. ప్రతిగడపకూ తెలంగాణ సంపద ఫలాలు చేరాయి. కేంద్రమంత్రులు, అధికారులు, అనేక రాష్ర్టాల మంత్రులు తెలంగాణను ఒక ఆదర్శంగా, మార్గదర్శిగా కొనియాడారు. ఐక్యరాజ్యసమితి మన పథకాలను ప్రశంసించింది. ఒంటరిగా మొలిచి మహావృక్షంగా ఎదిగిన నేత. నిబద్ధత, నిరాడంబరత ఆయన సహజత్వాలు. ఆయన మూలాలను వదిలిపెట్టని నాయకుడు. స్వయంకృషితో ఇంతగా ఎదిగిన నాయకుడు. ఎదిగే కొద్దీ మరింత బాధ్యతగా ఉందామన్నది ఆయన ఆలోచన. తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చిన కేసీఆర్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని NewsBuz ఆశిస్తోంది.