దక్షిణాదిన మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నేతలు ఉన్నప్పటికీ.. వరుసగా మూడు సార్లు గెలిచి, సీఎం పదవి చేపట్టి హ్యాట్రిక్ సాధించిన వారు లేరు. అయితే 9 ఏళ్ల క్రితం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఆ రికార్డును ఈసారి బ్రేక్ చేస్తారా..? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వరుసగా కొన్నేళ్ల పాటు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారు చాలా మందే ఉన్నారు. సిక్కిం మాజీ సీఎం చామ్లింగ్ 24 ఏళ్లకుపైగా సీఎం పదవిలో ఉన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 23 ఏళ్లుగా సీఎం పదవిలో కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, కమ్యూనిస్ట్ దిగ్గజ నేత జ్యోతిబసు 23 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగారు. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం హ్యాట్రిక్ ఎవరికి సాధ్యం కాలేదు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే కేసీఆర్ దక్షిణాదిన వరుసగా మూడోసారి సీఎంగా కొత్త చరిత్ర సృష్టిస్తారు. తెలంగాణ ప్రజలు హ్యాట్రిక్ ఛాన్స్ కేసీఆర్‌కు ఇస్తారా..? అనేది డిసెంబరు 3న తేలనుంది.