మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం మున్సిపోల్స్‌లో అనురించాల్సిన వ్యూహాలపై సుమారు గంటన్నర పాటు దిశానిర్ధేశం చేశారు. ఒక్క సీటు ఓడినా ఊరుకునేది లేదు, పదవులు పోతాయని మంత్రులకు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. జిల్లాల్లో నేతలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని, మంచి చెడులను చూసుకోవాలన్నారు. అధికారం తలకెక్కించుకోవద్దని, అహంకారంతో ఉండొద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను TRS సమావేశంలో ముుఖ్యమంత్రి ప్రస్తావించారు. అప్పట్లో అసెంబ్లీ ఫలితాలపై అనేక సర్వేలు నిర్వహించాం. సంగారెడ్డిలో మన అభ్యర్థి ఓడిపోతారని పదే పదే అభ్యర్థిని మార్చాలని చెప్పినప్పటికీ.. హరీష్ రావు వినిపించుకోలేదని గుర్తు చేశారు. పట్టుపట్టి మరీ సిట్టింగ్ అభ్యర్థికి హరీష్ టికెట్ ఇప్పించాడన్నారు. దీంతో ఆ సీటు ఓడిపోయామన్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com