వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి KCR పోటీ చేస్తారా.. లేదా.. అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని హుజురాబాద్ MLA ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ KCR ఇక్కడి నుంచి పోటీ చేస్తే.. BJP కూడా హుజురాబాద్ నుంచి కాకుండా ఈటలకు గజ్వేల్ టికెట్ ఇస్తే మాత్రం ఈసారి హోరాహోరీ పోరు తప్పదు. MLA ఈటల రాజేందర్‌కు ముందు నుంచే గజ్వేల్ నియోజకవర్గంలో మంచి సంబంధాలు ఉన్నాయి.