ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (36) కండీషన్ సీరియస్‌గా ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హార్ట్ సర్జరీ నుంచి కోలుకుంటూ ఆయన కోమాలోకి వెళ్లారని, బ్రెయిన్ డెడ్ అయ్యారని వార్తలు ఒక్కసారిగా ఆ దేశ భవిష్యత్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. దేశ నాయకత్వ పగ్గాలు కిమ్ సోదరికి దక్కే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. మరోవైపు కిమ్ బ్రెయిన్ డెడ్ అయ్యారంటూ వచ్చిన వార్తలను దక్షిణ కొరియా అధికార వర్గాలు తోసిపుచ్చాయి.
ఈ నెల 15న కిమ్ జోంగ్ ఉన్ తన తాత జయంతి కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో కిమ్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ‘డైలీ ఎన్‌కే’ వెబ్‌సైట్‌లో వార్తలు వచ్చాయి. గత ఏడాది ఆగస్టు నుంచి ఆయనకు గుండె సమస్యలు ఎక్కువైయ్యాయని.. ఈ నెల 12న ఆయన హ్యాంగ్‌సాన్ కౌంటిలోని ఒక విల్లాలో గుండెకు సంబంధించిన సర్జరీ చేయించుకున్నారని తెలిపారు. ఆ తర్వాత అమెరికా మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. హార్ట్ సర్జరీ తర్వాత కిమ్ ఆరోగ్యం విషమించిందని వివరించారు.
కిమ్ జోంగ్ ఉన్‌కు ఏదైనా జరిగితే దేశ నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టాలన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. కిమ్ జోంగ్ ఉన్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అధికార బాధ్యతలు చేపట్టేంత వయసు వీరికి లేదు. తాత్కాలికంగా అందరి దృష్టి కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్‌పై పడింది. కిమ్ జోంగ్‌కు కిమ్ జోంగ్ చోల్ అనే సోదరుడు ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ రాజకీయాల్లో పాలుపంచుకోలేదు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com