దేశమంతా రెండో విడత లాక్‌డౌన్‌లో ఉంది. మే 3వ తేదీ వరకు కొనసాగుతుంది. అలాగే ఈ నెల 20వ తేదీ నుంచి పలు రంగాలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు కూడా ఇచ్చింది. కానీ సెలూన్‌లకు మాత్రం అందులో చోటు దక్కలేదు. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాటికి మినహాయింపును ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.
ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్యతో హెయిర్ కట్ చేయించుకున్నానని తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కూడా అయింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ట్విట్టర్‌లో ప్రస్తావించారు. లాక్‌డౌన్ కారణంగా మూసివేసిన సెలూన్‌లు 20వ తేదీ తరువాత తెరిచేందుకు అనుమతి ఇచ్చే ఆలోచనలు ఉన్నాయా అని మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో ఓ నెటిజన్ అడిగారు. లేకపోతే కటింగ్ చేయడానికి నా భార్య ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అదే జరిగితే నేను లాక్‌డౌన్ తరువాత కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు.
Hey, when Virat Kohli could let his wife style his hair, why don’t you 😀 https://t.co/lSnS5WKZ6F
— KTR (@KTRTRS) April 16, 2020
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఆయన భార్య అనుష్క శర్మ కటింగ్ చేస్తుంది కదా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కోహ్లీ లాగా మీరెందుకు ప్రయత్నించకూడదంటూ రిప్లై ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై మాజీ ఎంపీ కవిత స్పందించారు.
Annayya .. Bhabi ki kuda chance isthunnava ?! 😍😀 https://t.co/Qd8HcujJx9
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 17, 2020