“సార్ Vs బ్రదర్”- వైరల్‌గా మారిన కేటీఆర్, పవన్ కల్యాణ్ ట్వీట్స్..

0
జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికర సంభాషణ జరిగింది. “ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సమర్థంగా మీ విధులు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ” మంత్రి కేటీఆర్‌ను అభినందించారు పవన్ కల్యాణ్. ఆ ట్వీట్‌లో కేటీఆర్‌ను ఉద్దేశించి సార్ అని సంబోధించారు పవన్ కల్యాణ్.

 

దీనిపై మంత్రి కేటీఆర్ “థ్యాంక్స్ అన్నా” అని రిప్లై ఇస్తూ.. మీరు నన్ను సార్ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? దయచేసి బ్రదర్ అని అనాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. దీనికి స్పందించిన పవన్.. అలాగే బ్రదర్ అని రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్విట్టర్ సంభాషణ వైరల్‌గా మారింది.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleహైదరాబాద్‌లో హాస్టళ్లు ఖాళీ చేయించడంపై మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు..
Next article‘క్వారంటైన్‌’కు ‘కరోనా‌’కు సంబంధం ఏంటి? ప్రపంచ దేశాలు ఎందుకు పాటిస్తున్నాయి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here