తెలంగాణ BJPలో కీలక మార్పులు.. బండి సంజయ్‌కి ప్రమోషన్.. ప్రకటనే మిగిలింది!

0
తెలంగాణ (Telangana) BJPలో ఏం జరుగుతోంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ (Bandi Sanjay)ని తొలగించి.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan Reddy)కి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తారా.. ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే ఈ మార్పులు జరుగబోతున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌కి కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం అలాంటిదేం ఉండదు. తప్పుడు ప్రచారం అని చెప్తూ వచ్చారు. కానీ నిన్న ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా సహా పలువురు ముఖ్య నేతలు ఐదు గంటల పాటు వివిధ రాష్ట్రాల్లో BJP పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారని తెలుస్తోంది.
ఈ ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు (రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం), వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఏ క్షణమైనా పలు రాష్ట్రాల్లో BJP అధ్యక్షులను మార్చే అవకాశముంది. పలువురు నేతలకు కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలిస్తోందా..?

ఓ పనై పోయింది.. ఆ ఇద్దరు చేరుతున్నారు.. కాంగ్రెస్‌లో షర్మిల చేరుతారా..?

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleఓ పనై పోయింది.. ఆ ఇద్దరు చేరుతున్నారు.. కాంగ్రెస్‌లో షర్మిల చేరుతారా..?
Next articleకాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన PhonePe.. చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్