దేశంలో రేపటి నుంచి పెళ్లిల సీజన్ ప్రారంభంకానుంది. నవంబరు 23 నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు సుమారు 38 లక్షల వివాహాలు జరగనున్నాయి. అయితే ఈ సీజన్‌లో రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివాహానికి అవసరమైన వివిధ వస్తువుల కొనుగోలు, సేవలపై గత ఏడాది కన్నా ఈ సీజన్‌లో రూ.1 లక్ష కోట్లు అధికంగా వ్యయం అయ్యే అవకాశం ఉందని, ఆర్థిక రంగానికి శుభసూచిక అని సీఏఐటీ స్పష్టం చేసింది. దేశంలోని 30 నగరాలకు చెందిన వ్యాపార సంఘాల నుంచి అందిన గణంకాల ఆధారంగా ఈ అంచనాలు రూపొందించారు.
గత ఏడాది ఇదే సీజన్‌లో 32 లక్షల వివాహాలు జరిగితే రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు అయిందని సీఏఐటీ ప్రకటించింది. ఒక్క దేశ రాజధాని ఢిల్లీలోనే 4 లక్షల వివాహాలు జరగబోతున్నట్టు తెలుస్తోంది. రూ. 1.25 లక్షల కోట్ల వ్యాపారం ఇక్కడే జరగనుంది.
నవంబరులో 23, 24, 27, 28, 29, డిసెంబరులో 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహ శుభఘడియలు అధికంగా ఉన్నాయని సీఏఐటీ తెలిపింది.