బిడ్డకు “ఉద్యోగం” కల్పించడంలో ఉన్న ఆతృత… అంటూ రేవంత్ రెడ్డి ఫైర్

1
“నిజాలు..నియామకాలు…!” అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికైన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన అరుణకు ఏడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ పోస్టింగ్ రాలేదు. ఆర్థిక అవసరాల నిమిత్తం అరుణ వ్యవసాయ పనులకు వెళుతుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈనాడు పేపర్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఎంపికై ఏడు నెలలు గడుస్తున్నా, ఇంకా తనకు పోస్టింగ్ ఇవ్వలేదని, గ్రూప్-2 ఉద్యోగం కోసం తాను ఎంతో శ్రమించానని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కథనాన్ని ట్వీట్ చేస్తూ, “బిడ్డకు” ఉద్యోగం” కల్పించడంలో ఉన్న ఆతృత…మా “తెలంగాణ ఆడబిడ్డ” పై లేదా…!! ” అంటూ తెలంగాణ CMOను ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleబీటెక్, డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన ఉన్నత విద్యామండలి చైర్మన్
Next articleదేశంలో లాక్‌డౌన్‌పై చర్చ.. మరోసారి సీఎంలతో మోడీ మీటింగ్..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here