బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (KCR).. జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టారు. అయితే ఇప్పటివరకు జనగామ, నర్సాపూర్‌కు మాత్రమే అభ్యర్థులను ఫైనల్ చేశారు.
జనగామ నుంచి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఫామ్ ఇచ్చారు. జనగామ టిక్కెట్ తనకే వస్తుందనుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించింది. భవిష్యత్‌లో అవకాశం ఇస్తామని.. ఈ ఎన్నికల్లో పల్లా గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. దీంతో ముత్తిరెడ్డిని టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా నియమించారు.
నర్సాపూర్‌లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తానే పోటీ చేస్తానని ప్రకటించడంతో రెండు నెలలుగా నర్సాపూర్ BRS అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నర్సాపూర్ బరి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారు. దీంతో సునీతా లక్ష్మారెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సమక్షంలోనే కేసీఆర్ సునీతా లక్ష్మారెడ్డికి బీఫామ్ అందజేశారు. నాంపల్లి, గోషామహల్ స్థానాలకు కూడా రేపో మాపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి గారిని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు.ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.
అదే సందర్భంగా ప్రస్థుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డి కి రాబోయే… pic.twitter.com/hEFRoaX6hg
— BRS Party (@BRSparty) October 25, 2023