అశోక్ గెహ్లాట్ ప్లాన్ సక్సెస్.. మరి ఈ ఇద్దరిలో గెలిచేదెవరు..?

0
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది. కానీ ఇప్పటివరకు బరిలో నిలిచే అభ్యర్థులపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి ప్రధాన కారణం రాజస్థాన్ రాజకీయ పరిణామాలు.
అటు రాహుల్ గాంధీ .. ఇటు సోనియా గాంధీతో సమావేశమైన రాజస్థాన్ CM అశోక్ గెహ్లాట్‌.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ గెహ్లాట్‌ను CM పదవి నుంచి తప్పిస్తే రాజీనామా చేస్తామని అధిష్టానాన్ని 90 మంది MLAలు బెదిరించారు. ఈ తిరుగుబాటు వెనుక గెహ్లాట్ ఉన్నారని అధిష్టానం భావించింది. దీంతో మరో సీనియర్ నేతను కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో నిలబెట్టేందుకు ప్రయత్నించింది. ఆంటోని, కమల్‌నాథ్ సహా మరికొందరు సీనియర్ నేతలను అధిష్టానం పోటీ చేయాలని కోరింది. కానీ ఆ ప్రతిపాదనను వారు తిరస్కరించారు.
ఇప్పటివరకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, MP శశి థరూర్ మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ పరిణామాల తర్వాత ఇవాళ సోనియా గాంధీతో రాజస్థాన్ CM అశోక్ గెహ్లాట్‌ సమావేశమయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleశివాజీ – ఛత్రపతి ఎలా అయ్యాడు.. శివాజీ నుండి మనం తెల్సుకోవాల్సింది ఏంటీ..?
Next articleKCR జాతీయ పార్టీ ప్రకటనకు టైమ్ ఫిక్స్.. తీర్మానం చేసేది వాళ్లే..!